Naga Chaitanya Next Movie | లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్యకు సాలిడ్ హిట్టే లేదు. సోగ్గాడే క్రేజ్‌తో బంగార్రాజు జస్ట్ బ్రేక్ ఈవెన్ మార్క్‌ను టచ్ చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన థాంక్యూ రెండో రోజే దుకాణం సర్దేసింది. మనం వంటి మర్చిపోలేని హిట్టిచ్చిన విక్రమ్ కే కుమార్ సైతం ఈ సారి నాగ చైతన్యను కాపాడలేకపోయాడు. గంపెడంత ఆశలు పెట్టుకున్న లాల్ సింగ్ చద్దా బాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ దెబ్బతో చైతన్య బాలీవుడ్ వైపు చూడటమే మానేశాడు. ఇక వెంకట్ ప్రభు వంటి కమర్షియల్ దర్శకుడిని నమ్ముకున్నా.. కస్టడీ రూపంలో తేరుకోలేని దెబ్బ పడింది. ప్రస్తుతం నాగచైతన్య ఓ భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో చందూ ముండేటితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంతకం చేశాడు.
సవ్యసాచి వంటి అల్ట్రా డిజాస్టర్ ఇచ్చినా.. చందూపై ఉన్న నమ్మకంతో ఈ సారి మరో చాన్స్ ఇచ్చాడు. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రేపో మాపో సెట్స్ మీదకు వెళ్లనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉందని ఇన్సైడ్ టాక్. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య మరో ప్రేమకథ చేయబోతున్నట్లు తెలుస్తుంది. సామజవరగమనతో ఊహించిన హిట్టు సాధించిన రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. ఇటీవలే రామ్ అబ్బరాజు, చైతన్యని కలిసి ఒక లైన్ చెప్పాడట. విడాకుల చుట్టూ తిరిగే వెరైటీ పాయింట్‌తో ఈ సినిమా కథ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఇదే కథకు రామ్ అబ్బరాజు తన స్టైల్ ఆఫ్ కామెడీని దట్టించనున్నాడట. మొత్తానికి ఆద్యంతం నవ్వించే స్క్రిప్ట్‌ను వండే పనిలో ఉన్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.