నిధి అన్వేషణలో ‘వృషకర్మ’
అగ్ర కథానాయకుడు నాగచైతన్య నటిస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి అగ్ర దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
అగ్ర కథానాయకుడు నాగచైతన్య నటిస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి అగ్ర దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం మేకర్స్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
విడుదలకు ఇంకా 50రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఓ సరికొత్త పోస్టర్ని కూడా విడుదల చేశారు. ైస్టెలిష్‌గా, యాక్షన్ అవతార్‌లో పదునైన కత్తులు అమర్చబడ్డ ఓ లోహపు తాడును ఆయుధంగా చేతబట్టి కనిపిస్తున్న నాగచైతన్యను ఈ పోస్టర్లో చూడొచ్చు. ఆయన చుట్టూ ఉన్న వాతావరణం తుఫానుని తలపిస్తున్నది.
నిధి అన్వేషణ నేపథ్యంలో మైథాలజీ, అడ్వెంచర్ అంశాలతో.. ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతున్నదని మేకర్స్ తెలిపారు. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగిందని మేకర్స్ చెప్పారు. స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాగుల్ డి.హెరియన్, సంగీతం: అజనీష్ బి.లోక్‌నాథ్, సమర్పణ: బాపినీడు, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

