ప్రస్తుతం తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’లో నటిస్తున్నారు యువహీరో నాగచైతన్య. ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలిసింది. ‘మజిలీ’ చిత్రం ద్వారా నాగచైతన్యకు మంచి విజయాన్ని అందించారు దర్శకుడు శివ నిర్వాణ. దాదాపు నాలుగేండ్ల విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుండటం విశేషం.
కుటుంబ అనుబంధాలు, ప్రేమ అంశాలు కలబోసి శివ నిర్వాణ సిద్ధం చేసిన సబ్జెక్ట్ నచ్చడంతో నాగచైతన్య వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పారని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలిసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో దర్శకుడు శివ నిర్వాణ ‘ఖుషి’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. మరోవైపు నాగచైతన్య నటిస్తున్న ‘కస్టడీ’ చిత్రం మే 12న రిలీజ్కు సిద్ధమైంది.