Naga Chaitanya | కొత్త పెళ్లికొడుకు అక్కినేని నాగచైతన్య తన జీవితం గురించి, తన ఆశలు, ఆకాంక్షల గురించి ఇటీవల ఓ సందర్భంలో ఆసక్తికరంగా మాట్లాడారు. నాగచైతన్యకు బైక్‌లన్నా, కార్లన్నా పిచ్చి. ఇటీవల ఆయన ఖరీదైన ఓ స్పోర్ట్స్ బైక్‌ని కొన్నారు. ఎవరైనా బైక్‌ని ఎక్కడ పెడతారు?.. సెల్లార్లో పెడతారు. కానీ.. నాగచైతన్య తానుండే 20వ అంతస్తుకు తీసుకెళ్లి, నట్టింట్లో పెట్టుకున్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ ‘నాకు ఆ బైక్ అంటే చాలా ఇష్టం. దాన్ని ఎక్కడో సెల్లార్లో ఉంచడం నాకిష్టం లేదు. అందుకే రోప్‌ల సహాయంతో దాన్ని పైకి తీసుకొచ్చి, లివింగ్ రూమ్‌లో పెట్టుకున్నాను.
ఆ టైమ్‌లో నన్నందరూ పిచ్చోడ్ని చూసినట్టు చూశారు. నిజానికి అవేం నేను పట్టించుకోను. నాకు నచ్చింది చేస్తాను.. అంతే..’ అంటూ చెప్పుకొచ్చారు నాగచైతన్య. ఇంకా మాట్లాడుతూ ‘జీవితంపై నాకు పెద్ద కోరికలంటూ ఏమీ లేవు. 50ఏళ్లు వచ్చేసరికి నాకు ఓ భార్య ఉండాలి. మా ఇద్దరికీ ఒకరో, ఇద్దరో పిల్లలుండాలి. నాకొడుకుని రేస్ ట్రాక్‌కి తీసుకెళ్లి, వాడు ఎంజాయ్ చేస్తుంటే వాడ్ని చూస్తూ నేను ఎంజాయ్ చేయాలి. కూతురు పుట్టిందనుకోండీ.. తన హాబీలన్నీ నేను అలవాటు చేసుకోవాలి. తనతో ఎక్కువ సమయం గడపాలి. నాకు తెలిసి ఓ మనిషికి ఇంతకు మించిన సక్సెస్ లేదని నా అభిప్రాయం.’ అని పేర్కొన్నారు నాగచైతన్య.