నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడు వెంకట్‌ప్రభు రూపొందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని తొలిగీతం ‘హెడ్ అప్ హై’ లిరికల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. యువన్‌శంకర్ రాజా స్వరపరచిన ఈ పాట మాస్ శైలిలో సాగుతూ పోలీసుల ఔన్నత్యాన్ని చాటే విధంగా ఉంది. రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్నందించిన ఈ పాటను యువన్‌శంకర్‌రాజా స్వయంగా ఆలపించారు. నాగచైతన్య డ్యాన్స్ కూడా ఈ పాటలో ప్రధానాకర్షణగా నిలిచింది. పవర్ఫుల్ పోలీస్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, నాగచైతన్య పాత్ర చిత్రణ గత సినిమాలను పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కృతిశెట్టి, అరవింద్‌స్వామి, ప్రియమణి, శరత్‌కుమార్, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యస్ఆర్. కతీర్, సంగీతం: ఇళయరాజా, యువన్‌శంకర్‌రాజా, సంభాషణలు: అబ్బూరి రవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్‌ప్రభు.