Naga Chaitanya | జోష్ టు NC23.. సక్సెస్‌ఫుల్‌గా నాగచైతన్య 14 ఇయర్స్ జర్నీ
Naga Chaitanya | అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) డెబ్యూ ప్రాజెక్ట్ జోష్ (Josh). 2009 సెప్టెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. యాక్టింగ్‌తో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్న నాగచైతన్య నేటితో టాలీవుడ్లో 14 ఏండ్లు సక్సెస్ ఫుల్‌గా ప్రయాణాన్ని పూర్తి చేశాడు.
Naga Chaitanya | అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా.. నాగార్జున నటవారసుడిగా జోష్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య(Naga Chaitanya). చైతూ డెబ్యూ ప్రాజెక్ట్ జోష్ (Josh) 2009న సెప్టెంబర్ 5న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నటనకు ఆస్కారమున్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. సినిమా సినిమాకు ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. యాక్టింగ్‌తో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్న నాగచైతన్య నేటితో టాలీవుడ్లో 14 ఏండ్లు సక్సెస్ ఫుల్‌గా ప్రయాణాన్ని పూర్తి చేశాడు.
లవ్, యాక్షన్, రొమాంటిక్.. ఇలా ప్రతీ జోనర్లో తనదైన మార్క్ చూపించే చైతూకు ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కథను నమ్మి సినిమాలు చేసే హీరోల జాబితాలో నాగచైతన్య టాప్‌లో ఉంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది కస్టడీతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం NC23 సినిమాతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ చందూమొండేటి, బన్నీ వాసు కాంబినేషన్లో ఈ సినిమా వస్తోంది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో Thandel టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.
నవంబర్ నుంచి ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో చైతూ అంతర్జాతీయ సరిహద్దు జలాల వెంబడి పాకిస్థాన్ దళాలకు పట్టుబడ్డ శ్రీకాకుళలం మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా NC23 రాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ మూవీ చైతూ కెరీర్లోనే అత్యధికంగా రూ.70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం విశేషం. ఈ మూవీలో హీరోయిన్గా సాయిపల్లవి, కీర్తిసురేశ్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
మత్స్యకారులతో ముఖాముఖి..
Pictures from the interaction of Yuvasamrat @chay_akkineni with fisherman family#NC23🌊 #NagaChaitanya pic.twitter.com/r8YFf0KQW8
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 3, 2023
Yuvasamrat @chay_akkineni interacting with fisherman in srikakulam 🌊 #NC23 💥#NagaChaitanya @chandoomondeti #BunnyVas pic.twitter.com/5hykOCISNm
— Uday Chaitu (@UdayChaitu9) August 3, 2023
Rugged Yuvasamrat @chay_akkineni landed in Vizag🤙#NC23 🌊🤔 #NagaChaitanya pic.twitter.com/Zs8g42wtrW
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

