Nag Ashwin | ‘కల్కి 2898 ఏడీ’ ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని అందరూ అంటున్నారు. నాలాంటి మేకర్స్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. థియేటర్స్‌కి వెళ్లిన ఆడియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పొందాలి. ‘కల్కి’ లాంటి సినిమాను తీసినందుకు దర్శకుడిగా గర్విస్తున్నాను. అమితాబ్, కమల్‌హాసన్, ప్రభాస్, దీపిక పదుకొనే వంటి సూపర్‌స్టార్స్‌ని డైరెక్ట్ చేయడం నా అదృష్టం’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు దర్శకుడు నాగఅశ్విన్. ఆయన దర్శకుడిగా గత నెల 27న విడుదలైన ‘కల్కి 2898ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్ శివారులో ఉన్న శంకరపల్లిలోని ‘కల్కి సెట్స్‌లో దర్శకుడు నాగ్అశ్విన్ విలేకరులతో ముచ్చటించారు.