తమన్నాలా ఉన్నానని చెప్పారు
ఉదయ్ శంకర్, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. గురు పవన్ దర్శకుడు. లవ్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది.
ఉదయ్ శంకర్, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. గురు పవన్ దర్శకుడు. లవ్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపింది నాయిక జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్. ఆమె మాట్లాడుతూ…‘ఈ సినిమాలో నేను సంధ్య అనే క్యారెక్టర్లో నటిస్తున్నాను. ఈ పాత్రకు రెండు భిన్నమైన షేడ్స్ ఉంటాయి. కొద్దిగా ప్రతినాయికలా అనిపిస్తాను. నా పాత్రకు ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు తర్వాత సన్నివేశం ఎలా ఉండబోతుందనే ఆసక్తి కలిగింది.
రేపు ప్రేక్షకులూ అదే అనుభూతి పొందుతారని ఆశిస్తున్నాను. ఇందులో బికినీ వేసుకున్నా…దర్శకుడు నన్ను అందంగా చూపించారు గానీ అసభ్యత అనిపించదు. ప్రేమ కథతో థ్రిల్లర్ అంశాలు కలిసి సాగుతాయి. హీరో ఉదయ్‌శంకర్ మంచి సహకారం అందించారు. పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్లు తెలుగు నేర్చుకున్నాను. తమన్నా, కృతి శెట్టి ఫీచర్స్ నాలో ఉంటాయని చెప్పడం ఆనందంగా ఉంది. నచ్చిన హీరో ఎన్టీఆర్, నాయిక సమంత. అన్ని రకాల పాత్రలు చేసి పేరు తెచ్చుకోవాలని ఉంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

