తేజ్ కూరపాటి, అఖిల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ వందెల దర్శకుడు. సెప్టెంబర్ 2న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. దర్శకులు కోదండరామిరెడ్డి, సాగర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఓ సరికొత్త ప్రేమ కథను సినిమాలో చూపిస్తున్నామని, మ్యూజికల్ ఎంటర్టైనర్గా సినిమా ఆకట్టుకుంటుందని, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే నెల 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.