Leo | దళపతి విజయ్ (Vijay) ప్రస్తుతం లియో (Leo.. Bloody Sweet)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తోంది. మేకర్స్ నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లియో ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.. విజయ్ సుత్తె పట్టుకొని యాక్షన్ మూడ్‌లో స్టిల్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ నా రెడీ సాంగ్ ప్రోమో (Naa Ready Song)ను విడుదల చేయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం విజయ్ బర్త్ డే గిఫ్ట్‌గా నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు. విష్ణు ఎడవన్ రాసిన ఈ ట్రాక్‌ను దళపతి విజయ్, అనిరుధ్ రవిచందర్ కలిసి పాడటం విశేషం. లియో ప్రాజెక్టులో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ విడుదల చేసిన లియో టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్నారు. లియోకు లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ సంభాషణలు సమకూరుస్తున్నారు. విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో మాస్టర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
Oru sirappana birthday treat thara #NaaReady 🔥
Poster Adi.. Annan Ready.. Kondaadi Koluthanumdi 💣#LeoFirstSingle lyric video ▶️ https://t.co/iatXkuEMIp#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @anirudhofficial @Jagadishbliss @trishtrashers @duttsanjay @akarjunofficial… pic.twitter.com/lMczapkpzf
— Seven Screen Studio (@7screenstudio) June 22, 2023
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..