Kuberaa On Prime | దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం కుబేర (Kuberaa on Prime). తమిళ నటుడు ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా.. ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించాడు. గత నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి హృదయాన్ని హత్తుకునే గీతం ‘నా కొడుకా’ ఫుల్ వీడియో సాంగ్ చిత్రబృందం విడుదల చేసింది. చనిపోయిన అనంతరం అనాధ అయిన తన కొడుకు కోసం తల్లి పాడే పాట ఇది. ఈ పాటకు నంద కిశోర్ సాహిత్యం అందించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ పాటను సింధూరి విశాల్ అద్భుతంగా ఆలపించారు. మరోవైపు ఈ చిత్రం ప్రమఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.