Mythri Movie Makers | సంధ్య థియేటర్ బాధిత కుటుంబానికి.. మైత్రి మూవీ మేకర్స్ రూ.50లక్షల ఆర్థిక సాయం!
Mythri Movie Makers | సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి మైత్రి మూవీస్ ఆర్థిక సాయం ప్రకటించింది. నిర్మాణ సంస్థ నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
Mythri Movie Makers | సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి మైత్రి మూవీస్ ఆర్థిక సాయం ప్రకటించింది. నిర్మాణ సంస్థ నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాన్ని సోమవారం కలిసి ఆయన చెక్కును అందజేశారు. పుష్ప-2 చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో ఈ నెల 4న తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.
ప్రస్తుతం సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి హీరో అల్లు అర్జున్‌తో పాటు సినీ ప్రముఖులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని.. కనీసం కుటుంబాన్ని సైతం పరామర్శించలేదని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అర్జున్‌తో పాటు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ బాధిత కుటుంబానికి రూ.50లక్షల చెక్కును అందజేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

