మనీష్ గిలాడ, అరవింద్‌కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. సుకు పూర్వజ్ దర్శకుడు. బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ నిర్మిస్తున్నారు. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశమిది. సూపర్‌హీరో పాత్రకు మన పురణాల నేపథ్యాన్ని జోడించి ఈ సినిమా తీశాను. భాగవతంలోని జయవిజయుల నేపథ్యంతో హీరో, విలన్ పాత్రను డిజైన్ చేశాం. శివుడిని కల్పిత పాత్రగా చూపించాను. హాలీవుడ్ నిపుణులతో చేసిన వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. ైక్లెమాక్స్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని నటుడు, నిర్మాత మనీష్ గిలాడ తెలిపారు. ఈ సినిమాలో 1500లకు పైగా గ్రాఫిక్ షాట్స్ ఉంటాయని మరో నిర్మాత శ్రీకాంత్ కండ్రేగుల పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివరామ్ చరణ్, సంగీతం: ఆశీర్వాద్, నిర్మాత: శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్, రచన-దర్శకత్వం: సుకు పూర్వజ్.