ఒకప్పుడు తెలుగు అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది హన్సిక. ప్రస్తుతం సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటూ లేడీ ఓరియెంటెడ్ కథాంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నది. ఈ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. రమ్యా ప్రభాకర్ నిర్మాత.
ఈ నెల 17న విడుదలకానుంది. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ ‘నా మనసుకు దగ్గరైన థ్రిల్లర్ కథాంశమిది. నా పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. హన్సిక పాత్ర ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నిర్మాత తెలిపారు. మురళీశర్మ, జయప్రకాష్, వినోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిశోర్ బోయిడపు, సంగీతం: మార్క్ కె రాబిన్, దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్.