Prabhas The Goat Life | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). ఈ ఏడాది సలార్ పార్టు 1లో వరదరాజమన్నార్‌గా స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం The Goat Life. వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యమిన్ రాసిన Aadujeevitham నవల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారని తెలిసిందే.
ఎప్పటిలాగే పృథ్విరాజ్ సుకుమారన్ తన పాత్రకు ప్రాణం పోశాడని ట్రైలర్‌తోనే అర్థమైపోతుంది. కాగా తన కోస్టార్ సినిమా ట్రైలర్‌పై గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రశంసలు కురిపించాడు. నా సోదరుడు పృథ్విరాజ్.. మీరు చేసిన పాత్రను చూస్తే.. వరదరాజ మన్నార్‌గా నటించిన వ్యక్తే ఇలా చేశాడని నేను నమ్మలేకపోతున్నాను. పృథ్విరాజ్‌కు నా అభినందనలు, ఆల్ ది బెస్ట్. అమితమైన ప్రేమతో ది గోట్ లైఫ్ కోసం ఎదురు చూస్తున్నా.. బ్లాక్‌బస్టర్ లోడ్ అవుతోంది.. అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు ప్రభాస్. నెట్టింట ప్రభాస్ పెట్టిన పోస్ట్‌తో The Goat Life సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.
బ్లేస్సీ రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీలో జిమ్మీ జీన్- లూయిస్, అమలాపాల్, రిక్ అబీ, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, అట్ల గ్లోబల్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Thank you Deva see you in the battlefield soon! 💥
-Prithviraj sir via Instagram #Prabhas #Kalki2898AD #Salaar #SHOURANGYAPARVAM #Kalki2898ADonMay9 pic.twitter.com/RoPU27vebv
— Prasanth🦖 (@Prastweetzz01) March 10, 2024
The Goat Life ట్రైలర్..