పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త చెప్పిన థమన్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం గాల్లో తేలిపోతున్నారు. దానికి కారణం ఆయన నటిస్తున్న సినిమాలు.. వాటికి సంబంధించిన అప్డేట్లు వరుసగా వస్తుండటం. పవన్ అభిమానులు ఇప్పుడు వకీల్ సాబ్ ఫీవర్‌లో ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు మరో మూడు నాలుగు సినిమాలు కూడా లైన్లో పెడుతున్నాడు పవన్ కళ్యాణ్. అన్ని సినిమాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే సంగీత దర్శకుడు థమన్.. పవన్ అభిమానులకు పండగ చేసుకునే వార్త చెప్పాడు. ఈయనతో ఎప్పుడెప్పుడు పని చేసే అవకాశం వస్తుందా అని చాలా సంవత్సరాలుగా వేచి చూస్తున్న థమన్‌కు ఒకేసారి రెండు సినిమాల్లో పనిచేసే అవకాశం ఇచ్చాడు పవర్ స్టార్.

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించిన థమన్.. తాజాగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కూడా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నాడు. సాగర్ కేంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు అందిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పాట పాడుతున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు థమన్. వకీల్ సాబ్ ప్రమోషన్స్‌లో భాగంగా థమన్ ఈ విషయాన్ని బయట పెట్టాడు. తనకు త్రివిక్రమ్ వల్లే పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశం వచ్చిందని తెలిపాడు ఈ సంగీత దర్శకుడు.

ఇదిలాఉంటే అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ పాడబోయే పాట అదిరిపోతుంది అని చెప్పాడు ఈయన. ఇప్పటికే కెరీర్లో దాదాపు ఎనిమిది పాటలు పాడాడు పవన్ కళ్యాణ్. తమ్ముడు, ఖుషి, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి సినిమాలలో బిట్ సాంగ్స్ పాడాడు ఈయన. తాజాగా మరోసారి ఆయన గళం విప్పబోతున్నాడు. మరి ఇది ఎలా ఉండబోతుందో చూడాలి. ముఖ్యంగా జానపద గేయాలు పాడటంలో పవన్ కళ్యాణ్ స్పెషలిస్ట్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శిల్ప కళా వేదిక దగ్గర పవన్ ఫ్యాన్స్ సందోహం.. పాసులు లేకపోతే అంతే..
పవన్-హరీష్ శంకర్ మూవీ క్రేజీ అప్డేట్
చిరంజీవి చెల్లెలుగా జయమ్మ ఒప్పుకుంటుందా..?
రకుల్‌ప్రీత్‌సింగ్ లాఫింగ్ నినాదం
రాజ్‌పుత్ బ్యూటీ అందానికి స్టన్ అవ్వాల్సిందే..!
బాలీవుడ్ ఎంట్రీకి నాగబాబు రెడీ..!
హిందీలో రష్మిక మందన్న, హన్సికను ఓడించిన అల్లు శిరీష్
మెగాస్టార్ ఆచార్య ‘లాహే లాహే’ సాంగ్‌కు భారీ రెస్పాన్స్
వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

