లవ్, యాక్షన్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘సూర్యవర్మ’. సాయిప్రణీత్, పునర్వి, సుచరిత ప్రధాన పాత్రధారులు. కాసర్ల మురళి సంగీత దర్శకత్వంతోపాటు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి కాసర్ల మురళి మాట్లాడుతూ ‘ అన్ని ఉద్వేగాలూ సమపాళ్లల్లో ఉండే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం.
కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. హీరోహీరోయిన్లు కొత్తవాళ్లయినా బాగా చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చివరి దశకు చేరుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు. రాజమల్లు, బాబురావు, ప్రణీత, గుల్ఫాకర్, కోడి రాము తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ప్రసాద్.