తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) హెచ్ వినోథ్ (H Vinoth) డైరెక్షన్లో ఏకే 61 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తునివు (Thunivu) టైటిల్‌తో తెరకెక్కుతుంది. నో గట్స్ నో గ్లోరీ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ మంజు వారియర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ (Ghibran) ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు.
ఫస్ట్ సాంగ్ మాస్ బీట్తో ఉండబోతుందని హింట్ ఇచ్చాడు. అజిత్‌కు అభిమానిగా ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పి.. సాంగ్‌పై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు గిబ్రాన్. ఈ క్రేజీ ప్రాజెక్టును భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో బోనీకపూర్ నిర్మిస్తున్నారు. పాట ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
తునివు చిత్రంలో సంజయ్ దత్, సముద్రఖని, మహానంది శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళనాడులో సంక్రాంతి 2023 కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది.
Read Also : Super star Krishna | కృష్ణ మరణంతో ట్రైలర్ వాయిదా వేసిన దిల్ రాజు టీం..!
Read Also : Suprerstar Krishna | కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు..
Read Also : Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్