Munjya Movie | బాలీవుడ్ నటి శార్వారీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ముంజ్యా’. ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ రూపొందించిన స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం హారర్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చి రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించడమే కాకుండా మంచి సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించాడు.
అయితే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఒక హిందీలోనే ఉండడంతో హారర్ సినిమాలను ఇష్టపడే అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాను తెలుగు వెర్షన్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బిట్టు (అభయ్ వర్మ) తనకు నచ్చినట్లు బ్రతుకుదాం అనుకుంటాడు. అయితే బిట్టు తల్లి పమ్మి (మోనా సింగ్)కి అతిజాగ్రత్త ఎక్కువ. అందుకే బిట్టును తనకు నచ్చినట్టుగా బ్రతకనివ్వదు. కానీ బిట్టు మాత్రం స్వేచ్ఛగా ఉండాలని కలలు కంటుంటాడు. ఇదిలావుంటే తన అమ్మమ్మ ఉండే కొంకణ్ ప్రాంతంలోని ఒక ఊరికి బిట్టు, పమ్మి కలిసి వెళ్తారు. అయితే ఆ ఊరిలో ముంజ్య అనే ఒక పిల్ల దయ్యం ఎంతోకాలంగా తన కోరికను తీర్చుకోవడానికి ఎదురుచూస్తుంటుంది. అయితే బిట్టు అనుకోకుండా ఆ పిల్ల దయ్యం దగ్గరికి వెళ్లగా అతడిని వశపరచుకుంటుంది ముంజ్య. తనకు మాత్రమే కనిపిస్తూ తనను టార్చర్ చేస్తుంటుంది. అయితే అసలు ముంజ్య ఎవరు. బిట్టు వెనక మాత్రమే ఎందుకు పడుతుంది. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.