ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది. చిన్న హీరోలే కాదు పెద్ద హీరోలు సైతం మల్టీ స్టారర్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆర్ఆర్ఆర్, మహా సముద్రం,బంగార్రాజు, భీమ్లా నాయక్ వంటి చిత్రాలు మల్టీ స్టారర్స్‌గా రూపొందుతుండగా, ఇప్పుడు మరో మల్టీ స్టారర్‌కి రంగం సిద్ధమైంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ మరో హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమయ్యాడు.
కొన్నాళ్లుగా సక్సెస్‌లు లేక ఇబ్బంది పడుతున్నట రాజ్ తరుణ్.. “జార్జ్ రెడ్డి” ఫేమ్ సందీప్ మాధవ్ తో కలిసి క్రేజీ మల్టీ స్టారర్ చేసేందుకు సిద్ధమయ్యాడు. “మాస్ మహారాజు” అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమాను అక్టోబర్ 10న ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఎం ఆషిఫ్ జానీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది.
రాజ్ తరుణ్ ఖాతాలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. “స్టాండ్ అప్ రాహుల్”, మరొకటి “అనుభవించు రాజా” అనే చిత్రాలతో ఈ కుర్ర హీరో బిజీగా ఉండగా, ఈ రెండు సినిమాలూ కామెడీ ఎంటర్టైనర్లు కావడం విశేషం. మరోవైపు “జార్జ్ రెడ్డి”తో గుర్తింపు తెచ్చుకున్న ఆ తరువాత మరే చిత్రంలోనూ కన్పించలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్‌తో సినిమా చేసి మరిన్ని ఆఫర్స్ అందుకునేందుకు కృషి చేస్తున్నాడు.