Ravish Desai | బాలీవుడ్లో మరో జంట విడిపోయింది. ప్రముఖ టీవీ సీరియల్ ‘కుంకుమ భాగ్య’లో ప్రాచీ పాత్రతో గుర్తింపు పొందింది నటి ముగ్ధా చాఫేకర్ విడాకులు తీసుకోబోతుంది. తన భర్త రవీష్ దేశాయ్ ముగ్థా నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘సత్రంగీ ససురాల్’ అనే సీరియల్లో వీరిద్దరూ కలిసి నటించగా.. ఈ సీరియల్ టైంలోనే ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ నిజ జీవితంలో ప్రేమగా మారింది. ఈ జంట 2016లో వివాహం చేసుకోగా.. 9 ఏండ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికినట్లు రవీష్ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
”చాలా రోజులు ఆలోచించిన తర్వాత ముగ్ధా, నేను భార్యాభర్తలుగా విడిపోయి.. మా స్వంత మార్గాలను అనుసరించాలని నిర్ణయించుకున్నాము. గత ఏడాది నుంచి ఈ విషయంపై చర్చలు జరుగుతుండగా.. తాజాగా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నామంటూ రవీశ్ చెప్పుకోచ్చాడు. దీనిపై తమకు గోప్యత కావాలని, తప్పుడు కథనాలను నమ్మవద్దని” అభిమానులను కోరాడు.