MSG | మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రూ.250 కోట్ల మార్క్‌ను చేరువై, ఇప్పుడు రూ.300 కోట్ల దిశగా వేగంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ చిత్రం, చిరంజీవి కెరీర్లో మరో భారీ హిట్‌గా నిలుస్తోంది.సినిమాలో మెగాస్టార్ వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే వీటన్నింటికంటే ఎక్కువగా అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్న అంశం మాత్రం చిరంజీవి డ్యాన్స్. ముఖ్యంగా ఒక పాటలో కనిపించే హుక్ స్టెప్ థియేటర్లలో విజిల్స్‌తో పాటు పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది.
ఈ హుక్ స్టెప్ ఇప్పుడు థియేటర్లను దాటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిన్నా–పెద్దా అన్న తేడా లేకుండా, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ పాటకు తమదైన స్టైల్లో డ్యాన్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు. చిరంజీవి ఎనర్జీ, గ్రేస్‌ను అనుకరిస్తూ వీడియోలు చేయడం ప్రస్తుతం ఓ ట్రెండ్‌గా మారింది.ఇటీవల ఈ పాటకు ఇద్దరు బామ్మలు స్టెప్పులు వేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ స్టైల్లో మొబైల్ ఫోన్ లైట్‌ను ఉపయోగిస్తూ ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను చూసిన చిరంజీవి అభిమానులు ఫిదా అవుతూ, “డ్యాన్స్‌కు వయసు అడ్డుకాదు” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరిశారు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు విభిన్న పాత్రల్లో కనిపించి సినిమాకు అదనపు బలం చేకూర్చారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. భీమ్స్ అందించిన సంగీతం, ముఖ్యంగా పాటలు సినిమాకు పెద్ద ప్లస్‌గా మారాయి. మేకర్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.226 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండటంతో, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Wow..Wow..Wow 🙂↕️❤️ pic.twitter.com/jkiYYv3rsI
— Movies4u Official (@Movies4u_Officl) January 17, 2026