Agadha | టాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు, నిర్మాత ఎం.ఎస్. రాజు సరికొత్త జోనర్లో తెరకెక్కిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ మూవీ ‘అగాధ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం, ఎం.ఎస్. రాజు కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఇందులో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, జోవిక విజయ్‌కుమార్, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి నుంచి చిత్ర బృందం ‘అగాధ’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఎం.ఎస్. రాజు స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పాన్-ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా కథను సస్పెన్స్‌గా ఉంచినప్పటికీ, టీజర్ ద్వారా ఒక సరికొత్త మిస్టరీ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఫాంటసీ అంశాలతో కూడిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, రాబోయే రోజుల్లో చిత్ర ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.