Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం చేయగా,ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. గేమ్ ఛేంజర్ సినిమాతో రామ్ చరణ్ స్థాయి మరింత పెరుగుతుందని అందరు అనుకుంటున్న సమయంలో గేమ్ ఛేంజర్‌తో పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా ఫ్లాప్‌తో మెగా ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశలో ఉన్నారు. నెక్ట్స్ సినిమా హిట్ అవ్వకుంటే చరణ్ ఖాతాలో హ్యాట్రిక్ ప్లాప్ రికార్డ్ చేరినట్టే. ట్రిపుల్ ఆర్ సినిమా సమయంలో ఆచార్య తెరకెక్కి ప్రేక్షకుల ముందు దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది.
వరుస ఫ్లాపులతో చరణ్ కాస్త నిరాశలో ఉండగా, ఇప్పుడు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌తో మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఈ చిత్రం రూరల్ బ్యాగ్రౌండ్ స్టోరీతో రూపొందుతుండగా, ఇందులో రామ్ చరణ్ స్పోర్ట్స్ మెన్(క్రికెటర్)గా కనిపిస్తారట. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో రామ్ చరణ్ తో పాటు స్టార్ క్రికెటర్ ఎంఎస్ థోని కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ . రామ్ చరణ్ క్రికెటర్ పాత్ర పోషిస్తుండగా.. థోని రామ్ చరణ్ కు ట్రైయినర్ గా కనిపించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే థోని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండగా, ఆయన నిర్మాతగా కొనసాగుతున్నారు. అయితే రామ్ చరణ్ సినిమాలో నిజంగా థోని నటిస్తే.. ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ దక్కడం ఖాయం. ఒకవైపు చరణ్‌కి పాన్ ఇండియా రేంజ్లో పాపులారిటీ ఉండగా, మరోవైపు ధోనికి ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్ ఉంది. దీంతో సినిమా ఓ రేంజ్లో బిజినెస్ జరుపుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక రామ్ చరణ్ సినిమా కోసం భారీ గా ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాదు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకుగా ఈసినిమా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.