Dacoit Movie | టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్. షానీల్ డియో దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తుండగా.. ఇటీవలే విడుదలైన సినిమా పవర్-ప్యాక్డ్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటి మృణాల్ ఠాకూర్ జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రకటించారు. ప్రస్తుత షెడ్యూల్లో మేకర్స్ అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, అనురాగ్ కశ్యప్, కామక్షి భాస్కర్లా వంటి ప్రముఖ నటులు కూడా భాగమయ్యారు. ఈ సినిమాకు అడివి శేష్ మరియు షానీల్ డియో సంయుక్తంగా కథ, స్క్రీన్‌ప్లే అందించారు. సుప్రియ యార్లగడ్డ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. భీమ్స్ సెసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.