ఈ మధ్య ధనుష్, మృణాళ్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది. అజయ్ దేవగన్ ‘సన్నాఫ్ సర్దార్ 2’ మూవీ స్క్రీనింగ్‌కు ధనుష్ హాజరయ్యారు. పైగా స్క్రీనింగ్ టైమ్‌లో మృణాళ్ చేయిపట్టుకొని మీడియా కంట పడ్డారు. దీనితోపాటు ధనుష్ ‘తేరే ఇష్క్ మే’ సినిమా పార్టీలో సైతం మృణాళ్ ప్రత్యక్షమవ్వడంతో ఈ సందేహాలు బలపడ్డాయి.
ఇటీవలే ధనుష్ తన భార్య ఐశ్వర్యకు విడాకులివ్వడం, మృణాళ్‌తో చేరువగా కనిపించడంతో సోషల్ మీడియా వీరులంతా రెచ్చిపోతున్నారు. దాంతో మృణాళ్‌కు ఈ విషయంపై స్పందించక తప్పలేదు. ‘ ధనుష్ నాకు ఫ్రెండ్ మాత్రమే. ‘సన్నాఫ్ సర్దార్ 2’ స్క్రీనింగ్‌కి తనని నేను పిలవలేదు. అజయ్ దేవగన్ పిలిచారు. ‘తేరే ఇష్క్ మే’ పార్టీకి వెళ్లడానికి కారణం కృతి సనన్. తను నా ఫ్రెండ్. దయచేసి ఊహించి రాయొద్దు.’ అంటూ సీరియస్‌గా చెప్పింది మృణాళ్ఠాకూర్.