Mr Bachchan Movie | టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’(Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి షో రీల్ పేరిట ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. వీడియో మొత్తం డైలాగ్స్ లేకుండా ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా సాగింది ఈ షో రీల్. ఈ చిత్రంలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.