పనాజీ: బాలీవుడ్, టీవీ నటి మౌనీ రాయ్ పెళ్లి .. మలయాళీ సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది. సూరజ్ నంబియార్‌ను ఆమె పెళ్లి చేసుకున్నది. ఇక ఇవాళ సాయంత్రం బెంగాలీ సంప్రదాయంలోనూ పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. బెంగాల్‌లోని కూచ్ బిహార్ ప్రాంతానికి చెందిన మౌనీ రాయ్.. దుబాయ్‌లో బ్యాంకర్‌గా పనిచేస్తున్న సూరజ్ నంబియార్ మధ్య చాన్నాళ్ల పరిచయం ఉంది. గోవాలోని కాండోలిమ్ బీచ్ వద్ద ఉన్న హిల్టన్ గోవా రిసార్ట్‌లో మౌనీ, సూరజ్‌ల పెళ్లి జరిగింది.