పనాజీ: బాలీవుడ్ నటి మౌనీ రాయ్ బెంగాలీ స్టయిల్లో పెళ్లి చేసుకున్నది. నిన్న ఉదయం మలయాళీ సాంప్రదాయంలో సూరజ్ నంబియార్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం మళ్లీ ఆమె బెంగాలీ సాంప్రదాయంలో మ్యారేజ్ చేసుకున్నది. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. బెంగాలీ స్టయిల్ డ్రెస్సులో మౌనీ బంగారు బొమ్మలా కనిపిస్తోంది. వెస్ట్ బెంగాల్‌లోని కూచ్ బీహార్ మౌనీ స్వస్థలం. దుబాయ్‌లో సూరజ్ వ్యాపారవేత్తగా ఉన్నాడు. పెళ్లి రోజున ఇద్దరూ సబ్యసాచి డిజైనర్ డ్రెస్సులో ఆకట్టుకున్నారు. గోవాలోని ఓ రిసార్ట్‌లో మౌనీ-సూరజ్ వెడ్డింగ్ వేడుక జరిగింది.