సోమవారం 25 మే 2020
Cinema - Mar 18, 2020 , 12:26:04

మోస్ట్ డిజైర‌బుల్ మెన్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌

మోస్ట్ డిజైర‌బుల్ మెన్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ .. హైద‌రాబాద్ టైమ్స్ ప్ర‌తి ఏడాది మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాను ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2019 సంత్స‌రానికి గాను 30 మందితో కూడిన జాబితాని కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించింది.  2018లో టాప్ పొజీష‌న‌ల్‌లో నిలిచిన విజ‌య్ దేవ‌ర‌కొండ 2019 సంవ‌త్స‌రానికి గాను తొలి స్థానంలో నిలిచాడు.  ఆయ‌న స్టైల్‌, బాడీ లాంగ్వేజ్‌, పాన్ ఇండియా న‌టుడిగా ఎంద‌రో అభిమానాన్ని పొందిన నేప‌థ్యంలో విజ‌య్‌కి తొలి స్థానం ద‌క్కింద‌ని ట్వీట్‌లో తెలిపారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ర్వాత  రామ్ చరణ్ రెండవ స్థానం సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఆయన మూడో స్థానంలో ఉండగా ఒక స్థానం మెరుగుపరచుకొని 2వ స్థానానికి చేరారు. ఇక  హీరో ప్రభాస్ రెండవ స్థానం నుండి 4వ స్థానానికి పడిపోవడం జరిగింది. గత ఏడాది ఆయన 2వ స్థానంలో ఉన్నారు.  ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న రామ్ పోతినేని ఏకంగా 8 స్థానాలు మెరుగుపరుచుకొని 3వ స్థానంలో నిలిచారు. ఎన్టీఆర్ 9వ స్థానం నుండి 19వ స్థానానికి పడిపోయారు. సుధీర్ బాబు, యాంకర్ ప్రదీప్ టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు పేరు 30 మందిలో లేక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.


logo