Drishyam 3 | మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మోహన్ లాల్, సంచలన దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించగా.. ఇటీవల విడుదలైన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘దృశ్యం 3’ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అయితే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్, విడుదలైన నెలలోపే ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు సిద్ధమైంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) భారీ ధరకు కైవసం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, తెలుగు బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం మలయాళం భాషలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల డబ్బింగ్ వెర్షన్ల విడుదలపై ఓటీటీ సంస్థ నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
View this post on Instagram