తొలి సినిమా హీరోతోనే వందో సినిమా
బహుభాషానటులు మాదిరిగానే, బహుభాషా దర్శకులు కూడా కొందరుంటారు. అలాంటి వారిలో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఒకరు. ఆయన మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. ‘నిర్ణయం’(నాగార్జున), ‘గాండీవం’(బాలకృష్ణ) సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారాయన.
బహుభాషానటులు మాదిరిగానే, బహుభాషా దర్శకులు కూడా కొందరుంటారు. అలాంటి వారిలో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఒకరు. ఆయన మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. ‘నిర్ణయం’(నాగార్జున), ‘గాండీవం’(బాలకృష్ణ) సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారాయన. దర్శకుడిగా ప్రియదర్శన్ తొలి సినిమా మోహన్‌లాల్ ‘పూచక్కోరు మూక్కుతి’(1984). 42ఏండ్లుగా దర్శక ప్రస్థానాన్ని సాగిస్తున్న ప్రియదర్శన్.. ఎట్టకేలకు 100 సినిమాల మైలురాయికి చేరుకున్నారు. తన తొలిచిత్ర కథానాయకుడైన మోహన్‌లాల్‌తోనే తన వందవ చిత్రాన్ని కూడా చేస్తానని ముందే చెప్పారు ప్రియదర్శన్. ఆయన చెప్పినట్టుగానే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
స్వయంగా మోహన్‌లాలే తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ‘సినిమా పట్ల ప్రియదర్శన్‌కు ఉన్న ప్రేమ వల్లే ఈ ఫీట్ సాధ్యమైంది. ఈ వంద సినిమాల ప్రయాణంలో నేనూ భాగం కావడం ఆనందంగా ఉంది. త్వరలో మరో మంచి కథతో కలుస్తాం’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. మోహన్‌లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్లో వచ్చిన కాలాపానీ, మిన్నరం, మరక్కార్ చిత్రాలు మలయాళంలో అఖండ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ప్రియదర్శన్ సినిమా అంటే బాలీవుడ్‌లోనూ క్రేజే. అక్షయ్‌కుమార్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘భూత్‌బంగ్లా’ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

