Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) ఇటీవలే తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే న్యూజిలాండ్‌లో కన్నప్ప షూటింగ్ కూడా షురూ అయినట్టు అప్డేట్ వచ్చేసింది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజాగా ఇంట్రెస్టింగ్ అఫీషియల్ అప్డేట్ వచ్చింది. కన్నప్ప కోసం ఇద్దరు లెజెండరీ యాక్టర్లు ఒక్కచోట చేరారు. ఆ యాక్లర్లే ఒకరు మోహన్ బాబు కాగా.. మరొకరు శరత్‌కుమార్. న్యూజిలాండ్‌లో చిట్ చాట్ సెషన్‌కు సంబంధించిన స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో శాండల్ వుడ్ హీరో శివరాజ్‌కుమార్ (Shiv Rajkumar) కీలక పాత్రలో కనిపించబోతున్నాడని ఓ వార్త హల్ చల్ చేస్తుండగా.. క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. రానున్న రోజుల్లో కన్నప్ప ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు అందించనుంది విష్ణు టీం. మొత్తానికి ఈ సారి పాన్ ఇండియా మార్కెట్‌పై పాగా వేయాలని గట్టిగా ఫిక్సయినట్టు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో అర్థమవుతోంది.
Two superstars, the legends ‘Pedarayudu’, Mohan Babu Sir and Sharath Kumar Sir, unite for ‘Kannappa’ in New Zealand. Adding their immense star power to this highly anticipated Indian cinematic extravaganza. Get ready for a legendary tale of devotion and grandeur! 🌟🏹… pic.twitter.com/0wJhgECRrV
— BA Raju’s Team (@baraju_SuperHit) November 9, 2023
Mission. Vision. Passion.
🎬Kannappa: Vishnu Manchu’s Dreams to Reality.Dream Project #Kannappa begins #ATrueIndianEpicTale
“Pooja Ceremony”@themohanbabu @iVishnumanchu @mukeshvachan pic.twitter.com/ItB0N2Q4aP
— Kannappa The Movie (@kannappamovie) September 1, 2023