తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్ లాల్ లుక్ షేర్ చేసుకుంది సన్ పిక్చర్స్.
డార్క్ షేడ్స్ ఉన్న రూంలో మోహన్ లాల్ కిటికీ దగ్గర సుదీర్ఘంగా ఆలోచిస్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. జైలర్ సెట్స్ నుంచి మోహన్ లాల్ లుక్ అంటూ అఫీషియల్ ట్విటర్ ఖాతాలో తాజా స్టిల్ షేర్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
యాక్షన్ కామెడీ నేపథ్యంలో ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. జైలర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ లాల్ గతేడాది మాన్స్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..