శివ బాలాజీ భార్యపై సీరియస్ అయిన మోహన్ బాబు.. కారణమిదే..!

mohan babu serious on shiva balaji wife madhumitha | సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఉన్న కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఆయన గురించి పూర్తిగా తెలుసు. ఎప్పుడు ఎలా ఉంటాడనేది ఆయనను చూస్తేనే అర్థమవుతుంది. ముఖ్యంగా కొన్నిసార్లు అందరి ముందే సీరియస్ అవుతుంటాడు మోహన్ బాబు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా ఒక కార్యక్రమానికి తనయుడు మంచు విష్ణుతో కలిసి హాజరయ్యాడు మోహన్ బాబు. మొన్న మా ఎన్నికలలో గెలిచిన సభ్యులు చాలామంది ఈ వేడుకలో కనిపించారు. ఈ సందర్భంగా స్టేజిపై మాట్లాడుతున్న మోహన్ బాబు.. శివ బాలాజీ భార్య మధుమితపై సీరియస్ అయ్యాడు.
ఈ కార్యక్రమంలో మోహన్ బాబు తన 45 ఏళ్ల సినీ కెరీర్ గురించి విషయాలు చెప్పాడు. మధ్యలో తాను పడిన కష్టాలు.. గురువు దాసరి నారాయణరావు తనకు చేసిన సాయం గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలు, మా ఎన్నికల గురించి ఓపెన్ అయ్యాడు మోహన్ బాబు. నిజమైన రాజకీయాల కంటే సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ పాలిటిక్స్ జరుగుతున్నాయని.. ఇది తనకు ఆశ్యర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఎస్వీ రంగారావు, గుమ్మడి, రావు గోపాలరావు వంటి సీనియర్ నటుల గురించి ఆయన ప్రస్తావించాడు. ఇలా మాట్లాడుతున్న సమయంలోనే స్టేజి వెనకాల నుంచి కొన్ని గుసగుసలు వినిపించాయి. అది విన్న వెంటనే సీరియస్ అయ్యాడు మోహన్ బాబు.
ఆ గుసగుసలు పెట్టింది ఎవరో కాదు శివ బాలాజీ భార్య , నటి మధుమిత. ఆమె వైపు సీరియస్‌గా చూసిన మోహన్ బాబు.. ఏ అమ్మాయి ఏంటిది.. ఇలాంటివి నాకు నచ్చవు.. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు సైలెంట్‌గా ఉండటం నేర్చుకో అంటూ సీరియస్ అయ్యాడు. ఆ వెంటనే మధుమతి కూడా సారీ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా మోహన్ బాబుకు కోపం తెప్పిస్తే ఫసక్ అయిపోతారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
చిరంజీవి చేతికి గాయం.. కంగారు పడుతున్న అభిమానులు..
Benerjee | మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు: బెనర్జీ
Mohan Babu | నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు: మోహన్ బాబు
Mohan Babu: నిన్ను అందుకే కొన్నాళ్లు పక్కన పెట్టాను.. ఆలీతో మోహన్ బాబు
మోహన్ బాబును దొంగ నా కొడుకు అని తిట్టిన స్టార్ హీరో ఎవరు..?
Maa elections | ఒక్క ఓటమితోనే మెగా ఫ్యామిలీ సత్తా తగ్గిపోతుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

