Mohan Babu | మంచు ఫ్యామిలీ ఇంట్లో వివాదం చెలరేగింది. తనపై, తన భార్యపై తన తండ్రి టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు మంచు మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గాయాలతోనే పీఎస్‌కి వెళ్లిన మనోజ్ మోహన్ బాబుపై హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును అందించాడు.
ఇదిలావుంటే తాజాగా మోహన్ బాబు కూడా మనోజ్‌పై ఫిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్ తనపై దాడి చేశాడంటూ అదే పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు మోహన్ బాబు. ఆస్తులు, స్కూల్ వ్యవహారం విషయంలో తనతో గొడవపడి తనను కొట్టాడు అంటూ మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.