అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టేక్’. సన్నీ కోమలపాటి దర్శకుడు. అజయ్ కతుర్వార్, తాన్య, కరిష్మాకుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ విడుదలచేసింది. అభినవ్ సర్దార్ మాట్లాడుతూ ‘యాక్షన్ అంశాలతో సాగే మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ఓ తప్పు కొందరి జీవితాల్లో ఎలాంటి గందరగోళాన్ని సృష్టించిందన్నది అలరిస్తుంది. ఆద్యంతం ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రతి పాత్రకు సమాన ప్రాధాన్యత ఉంటుంది’ అని తెలిపారు. సమీర్, రాజారవీంద్ర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణి జెన్న, సినిమాటోగ్రఫీ: హరి జాస్తి.