Tom Cruise | హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ (Tom Cruise) ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ (Mission Impossible The final Reckoning). స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన చిత్రానికి క్రిస్టోఫర్ మేక్‌క్వారీ దర్శకత్వం వహించగా. మే 23న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇక మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీలో చివరిచిత్రం కావడంతో అభిమానులు ఎగబడి మరి థియేటర్‌కి వెళ్లారు. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదికలు అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీల్లో ఆగష్టు 19 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.