Miss Shetty Mr Polishetty | మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపై ముందు నుంచి పెద్దగా అంచనాల్లేవు. రిలీజ్ డేట్లో మార్పులు, టీజర్, ట్రైలర్ కూడా పెద్దగా ఆకట్టకోకపోవడంతో ఈ సినిమా పేరు జనాలకు అంతగా రిజిస్టర్ అవ్వలేదు. పైగా దానికి తోడు జవాన్ సినిమాకు పోటీగా దింపడంతో ఈ సినిమా కొట్టుకుపోవడం ఖాయం అని అనుకున్నారు. తొలిరోజు అదే జరిగింది కూడా. జవాన్ దాటికి మిస్ శెట్టి పేరు కూడా వినిపించలేదు. అయితే మెల్లిగా టాక్ పాజిటీవ్‌గా రావడంతో కొంచెం కొంచెంగా పుంజుకుంది. ఇక శని, ఆదివారాలు వచ్చే సరికి కొన్ని చోట్ల టిక్కెట్లు దొరకని పరిస్థితి కూడా ఏర్పడింది. అంతలా సినిమా పికప్ అయింది. దానికి తోడు రిలీజ్‌కు ముందు చిరు, రిలీజ్ తర్వాత మహేష్ రివ్యూలు కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది.
ఇక తాజాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తయిపోయింది. ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ.13.5 కోట్ల బిజినెస్ జరిగింది. కాగా సోమవారం అడ్వా్న్స్ బుకింగ్స్‌తో కలిసి ఈ సినిమాకు రూ.14 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయన్నది ఇన్సైడ్ టాక్. ఇక అమెరికాలో ఊహించిన రేంజ్లో ఈ సినిమా దూసుకుపోతుంది. కేవలం నాలుగు రోజుల్లో 1మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది. ఇక ఈ సినిమా నవీన్ వరుసగా మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు. రోమ్ కామ్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు. పి దర్శకుడు.
ఇక ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ నవీన్ పొలిశెట్టికే ఇవ్వాలి. సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు. రిలీజ్‌కు ముందు ముఖ్యమైన ప్రతీ నగరాలకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేశాడు. అంతేకాకుండా అమెరికాకు వెళ్లి ప్రేక్షకులతో కలిసి ప్రిమియర్లు చూశాడు.