Mirchi movie | బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అంటే గుర్తేచ్చేది మిర్చి. ఈ చిత్రంలో ప్రభాస్ అటు క్లాస్‌గా ఇటు మాస్‌గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇందులో ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్‌కే సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. రెబల్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ప్రభాస్‌కు సాలిడ్ కంబ్యాక్ ఈ చిత్రం ఇచ్చింది. ఈ సినిమాతో కొరటాల శివ రచయిత నుండి దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై మొదటి చిత్రంగా మిర్చి తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా అనుష్క, రిచా గంగోపాధ్యాయలు హీరోయిన్లుగా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలైతే అప్పట్లో శ్రోతల చెవులలో మార్మోగిపోయాయి. 2013 ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజీటీవ్ టాక్‌ను తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీనీ సృష్టించింది. నేటితో ఈ చిత్రం 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి వచ్చిన ఫైనల్ కలెక్షన్లను ఒకసారి గమనిస్తే..
నైజాం : 15.11 కోట్లు
సీడెడ్ : 7.51 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.20 కోట్లు
ఈస్ట్ : 2.90 కోట్లు
వెస్ట్ : 2.65 కోట్లు
గుంటూరు : 3.71 కోట్లు
కృష్ణ : 2.75 కోట్లు
నెల్లూరు : 1.67 కోట్లు
ఏపీ+తెలంగాణ (టోటల్) : 40.50 కోట్లు
ఓవర్సీస్ : 2.90 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 4.30 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 47.70 కోట్లు
మిర్చి చిత్రానికి 31 కోట్ల ప్రీ రిలిజ్ బిజినెస్ జరిగింది. 31.5 కోట్లతో బ్రేక్ ఈవేన్ టార్గెట్లోకి బరిలో దిగిన ఈ చిత్రం ఫైనల్‌గా 47.70 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం కొన్న బయ్యర్స్‌కు ఏకంగా 16.20 కోట్ల లాభాలు వచ్చాయి.