Mirai | జపాన్‌లో తేజ సజ్జా ‘మిరాయ్’ సంచలనం.. బాహుబలి 2, ధురంధర్ 2ను దాటేసిన అడ్వాన్స్ బుకింగ్స్!
Mirai | యంగ్ హీరో తేజ సజ్జా నటించిన విజువల్ వండర్ ‘మిరాయ్’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇండియాలో భారీ అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు జపాన్ మార్కెట్లో సత్తా చాటుతోంది. ఆగస్టు 21న జపాన్‌లో ‘Mirai: Unmei no Senshi’ (The Warrior of Destiny) పేరుతో విడుదలైన ఈ చిత్రం..
Mirai | యంగ్ హీరో తేజ సజ్జా నటించిన విజువల్ వండర్ ‘మిరాయ్’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇండియాలో భారీ అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు జపాన్ మార్కెట్లో సత్తా చాటుతోంది. ఆగస్టు 21న జపాన్‌లో ‘Mirai: Unmei no Senshi’ (The Warrior of Destiny) పేరుతో విడుదలైన ఈ చిత్రం.. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలన రికార్డులు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. భారతీయ సినిమాలకు జపాన్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా భారీ విజువల్స్, మైథలాజికల్, హిస్టారికల్ అంశాలతో తెరకెక్కిన సినిమాలకు అక్కడ మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘మిరాయ్’ కూడా జపాన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ట్రేడ్ ట్రాకర్ల ప్రకారం.. జపాన్‌లో భారతీయ సినిమాల డే-1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘మిరాయ్’ టాప్-6లో నిలిచినట్లు సమాచారం. అంతేకాదు, అడ్వాన్స్ టికెట్ సేల్స్ పరంగా ‘బాహుబలి 2’, ‘ధురంధర్ 2’, ‘టైగర్ జిందా హై’ వంటి సినిమాలను కూడా అధిగమించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. సినిమా విడుదలకు ముందే ఇలాంటి స్పందన రావడం తేజ సజ్జా అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘మిరాయ్’ గతేడాది భారీ అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా కథనం, యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, భారీ ప్రొడక్షన్ విలువలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి తేజ సజ్జా కెరీర్లో ప్రత్యేకమైన విజయంగా నిలిచింది.
ఇప్పుడు అదే సినిమా జపాన్‌లోనూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోంది. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఇంతటి స్పందన రావడంతో రానున్న రోజుల్లో సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ‘మిరాయ్’లో మైథలాజికల్, హిస్టారికల్ అంశాలతో పాటు భారీ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. అశోక చక్రవర్తి కాలం నాటి నేపథ్యాన్ని ఆధారంగా చేసుకున్న కథలో.. మానవుడిని దేవుడిగా మార్చగల శక్తి ఉన్న తొమ్మిది పవిత్ర గ్రంథాలు కీలకంగా ఉంటాయి.ఆ శక్తిని సొంతం చేసుకుని ప్రపంచాన్ని చీకటిలోకి నెట్టాలని ప్రయత్నించే బ్లాక్ స్వోర్డ్కు ఎదురుగా తేజ సజ్జా పోషించిన వేద అనే యోధుడు పోరాడటం కథలో ప్రధాన అంశం. సినిమాలోని విజువల్ గ్రాండియర్‌తో పాటు బౌద్ధ తత్వానికి సంబంధించిన అంశాలు కూడా ఉండటం జపాన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

