FIR Movie | కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కింది. తెలుగులో ఈ చిత్రాన్ని అభిషేక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రం శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. తాజాగా ఈ చిత్రాన్ని మలేషియా, కువైట్, ఖతర్ వంటి దేశాలలో బ్యాన్ చేశారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంపై చర్య తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు సినిమాటోగ్రఫి శాఖమంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను కోరారు.
ఎంఐఎం MLAలు జాఫర్ హుస్సేన్ మెరాజ్, సయ్యద్. అహ్మద్ పాషా ఖాద్రి, కౌసర్ మొహినోద్దీన్ మంత్రిని కలిసి ఎఫ్ఐఆర్ తెలుగు సినిమా పోస్టర్లో హీరో మొఖంపై ముద్రించిన అరబిక్ పదాలను తొలగించాలని కోరారు. ఆ పదాలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయిని.. వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే స్పందించిన మంత్రి FDC ED కిషోర్ బాబు తో ఫోన్లో మాట్లాడారు. ఎఫ్ఐఆర్ సినిమా ప్రతినిధులతో మాట్లాడి అరబిక్ పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
#AIMIM MLA's Led by @ahmedpashaqadri along with @kausarmohiuddin and @Jaffarhusainmla Given a Memorandum to @YadavTalasani Against the Telugu Movie #FIR Which Printed Kalma on Poster. pic.twitter.com/zORr2CNLNR
— Syed Fasahat Ali (@syedfasahat7) February 11, 2022