Merry Christmas Movie | ఒక వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తూ విలక్షన నటుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించికున్నాడు విజయ్ సేతుపతి. పాత్ర నచ్చితే నిడివి ఎంత అని ఆలోచించకుండా నటించే అతికొద్ది మంది నటులలో ఈయన ఒకడు. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఆరు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో మేరీ క్రిస్మస్ ఒకటి. శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అంధాధూన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లు బ్రేక్ తీసుకుని శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
రెడ్ వైన్‌తో ఉన్న రెండు గ్లాసులు పగిలినట్లు పోస్టర్లో చూపించారు. టైటిల్ పోస్టర్‌తోనే సినిమాపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా కత్రినా కైఫ్ నటిస్తుంది. ఈ సినిమాను టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమా హిందీతో పాటు తమిళంలోనూ రిలీజ్ కానుంది. ఇక విజయ్ నేరుగా నటిస్తున్న తొలి హింది చిత్రం ఇదే కావడం విశేషం. దీనితో పాటు షారుఖ్ ‘జవాన్’లోనూ విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
#MerryChristmas coming soon.#SriramRaghavan #KatrinaKaif @tipsofficial @RameshTaurani #SanjayRoutray #JayaTaurani @ipritamofficial #MatchboxPictures
Music on #Tips pic.twitter.com/bDPURdIdHa
— VijaySethupathi (@VijaySethuOffl) December 24, 2022