Merlapaka Gandhi | లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ సినిమాకు నా భార్యే స్పూర్తి : డైరెక్టర్ మేర్లపాక గాంధీ
మేర్లపాక గాంధీ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ (LikeShareSubscribe Trailer). నవంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు మేర్లపాక గాంధీ.
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Shobhan), మేర్లపాక గాంధీ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ (LikeShareSubscribe Trailer). జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. ఫన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటూ ముందుకెళ్తోంది. నవంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు మేర్లపాక గాంధీ.
ఉల్లాసకరమైన వినోదాన్ని అందించేలా సినిమా ఉంటుందని అంటున్నాడు మేర్లపాక. సినిమా కోర్ పాయింట్ ఏంటో చెప్పని ఈ డైరెక్టర్.. ఈ సినిమా రావడానికి స్పూర్తి ఏంటో వెల్లడించాడు.
నేను లాక్డౌన్ టైంలో యూట్యూబ్‌లో చాలా వీడియోలు చూసేవాడిని. వాటిలో కొన్ని ట్రావెల్ వీడియోలు నాకు ఆసక్తికరంగా అనిపించాయి. నాకు ట్రావెలింగ్ సినిమాలంటే ముందు నుంచి చాలా ఇష్టం. నా భార్యకు ఓ యూట్యూబ్ ఛానెల్ ఉంది. అయితే ఆమెకు యూ ట్యూబ్ సబ్ స్క్రైబర్లు పెరుగకపోవడంతో చాలా బాధపడేది. అదే లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ సినిమా కథకు స్పూర్తి అన్నాడు.
ఇటీవలే రిలీజైన వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్లో మెగాస్టార్ చిరంజీవి వీడియో చివరలో లైక్ చేయండి & సబ్‌స్క్రైబ్ చేయండి అని అంటారు. చిరంజీవి చెప్పిన ఆ డైలాగ్ మా సినిమాకు చాలా సాయం అవుతుంది. ఈ క్లిప్‌ను మేము లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా ప్రమోషన్ల కోసం వాడుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు.
లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్..
ఈ చిత్రంలో సంతోష్ శోభన్ ట్రావెల్ వ్లోగర్ గా నటిస్తున్నాడు. బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిహారికా ఎంటర్టైన్ మెంట్-ఆముక్త క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్నది.
Read Also : Mehreen Pirzada | ఐలాండ్‌లో విక్రాంత్‌తో మెహరీన్ ఫిర్జాదా.. కొత్త అప్డేట్ స్టిల్స్ వైరల్
Read Also : Harish Kalyan | జెర్సీ నటుడు హరీష్ కల్యాణ్ వెడ్డింగ్ డేట్, టైం వివరాలివే
Read Also : Balakrishna | సినిమాటిక్ స్టైల్లో నందమూరి బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్.. వీడియో
Read Also : Black and white Teaser | హెబ్బా పటేల్ బ్లాక్ అండ్ వైట్ టీజర్
Read Also : Jyotika | 13 ఏండ్ల తర్వాత రీఎంట్రీ.. సెట్స్‌లో జ్యోతిక వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

