సాయికుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మెర్సీ కిల్లింగ్’. సూరపల్లి వెంకటరమణ దర్శకుడు. మాధవి తాలబత్తుల నిర్మాత. శనివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథాంశమిదని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా చిత్రాన్ని తెరెక్కించామని హీరో సాయికుమార్ తెలిపారు. అనాథ బాలిక తనకు జరిగిన అన్యాయంపై చేసే పోరాటం ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్.జి, సంగీతం: ఎం.ఎల్.రాజు, నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల, దర్శకత్వం: వెంకటరమణ ఎస్.