Mehreen Pirzada | కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది మెహరీన్ ఫిర్జాదా (Mehreen Pirzada). ఆ తర్వాత రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. గతేడాది ఎఫ్3తో చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను పలుకరించిన ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉండే ఈ భామ వెకేషన్ ట్రిప్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.ఇంతకీ మెహరీన్ ఎక్కడికెళ్లిందనే కదా మీ డౌటు. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం గోవా (Goa). మెహరీన్ ఫ్లవర్ ప్యాటర్న్ టాప్, బ్లాక్ షాట్స్‌లో సముద్ర అలల సోయగాన్ని ఆస్వాదిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ ప్రాజెక్ట్ స్పార్క్‌లో నటిస్తోండగా.. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు కన్నడలో మరో సినిమాని కూడా లైన్లో పెట్టింది.