Megaverse | ‘మెగావర్స్’గా మెగాస్టార్ కొత్త ప్రయాణం.. ‘ అఫీషియల్ ప్రకటన చేసిన నెట్‌ఫ్లిక్స్
Megaverse | మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా వెండితెరపై తన నటన, డ్యాన్సులు, యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఇప్పుడు ఓటీటీ వేదికపై టాక్ షోతో సందడి చేయనున్నారు. చిరంజీవి ప్రధాన ఆకర్షణగా తెరకెక్కుతున్న ఈ కార్యక్రమానికి ‘మెగావర్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Megaverse | మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా వెండితెరపై తన నటన, డ్యాన్సులు, యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఇప్పుడు ఓటీటీ వేదికపై టాక్ షోతో సందడి చేయనున్నారు. చిరంజీవి ప్రధాన ఆకర్షణగా తెరకెక్కుతున్న ఈ కార్యక్రమానికి ‘మెగావర్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ షోను అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. “మాస్‌కి గ్రామర్.. స్టైల్‌కి డెఫినిషన్.. మెగాస్టార్ ఈజ్ హియర్!” అంటూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీంతో చిరంజీవి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాలతో పాటు టాక్ షో ద్వారా ఆయన ప్రేక్షకులతో ఎలా ముచ్చటిస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
చిరంజీవి గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తనదైన మాటతీరు, ఆత్మీయమైన పలకరింపులతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఓటీటీ వేదికను ఎంచుకున్నారు. ‘మెగావర్స్’ కార్యక్రమం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తుంది. తొలి ఎపిసోడ్లో హాస్యనటుడు బ్రహ్మానందంతో పాటు సునీల్, సత్య పాల్గొన్నట్లు సమాచారం. చిరంజీవి, బ్రహ్మానందం కలిసి వెండితెరపై ఎన్నో సందర్భాల్లో ప్రేక్షకులను నవ్వించారు. ఇప్పుడు ఈ ఇద్దరూ టాక్ షో వేదికపై కలిస్తే ఎలాంటి సరదా సంభాషణలు సాగుతాయన్న ఆసక్తి నెలకొంది. బ్రహ్మానందంతో చిరంజీవికి ఉన్న అనుబంధం, వారిద్దరి మధ్య ఉండే హాస్యభరిత సంభాషణలు ఈ ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవవచ్చని అభిమానులు భావిస్తున్నారు. సునీల్, సత్యల రాకతో వినోదం మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలుగు ఓటీటీ, బుల్లితెర రంగాల్లో ప్రముఖులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించే కార్యక్రమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంతో ప్రేక్షకులను అలరించగా, జగపతి బాబు కూడా ఓటీటీ వేదికపై కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి టాక్ షోపై కూడా అంచనాలు పెరిగాయి.‘మెగావర్స్’లో రాబోయే ఎపిసోడ్లకు మరికొందరు సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే వారి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన వెలువడగా, స్ట్రీమింగ్ తేదీ, ట్రైలర్ విడుదల వివరాలు ప్రకటించాల్సి ఉంది. నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చే తదుపరి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Megaverse | ‘మెగావర్స్’గా మెగాస్టార్ కొత్త ప్రయాణం.. ‘ అఫీషియల్ ప్రకటన చేసిన నెట్‌ఫ్లిక్స్
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
Kidney health | కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..!
నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Harish Rao | మల్లన్నసాగర్‌కు అతీ సమీపంలో బ్లాస్టింగ్లు.. ప్రమాదంలో రిజర్వాయర్ : మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

