Chiranjeevi | మెగాస్టార్ ఇంట్లో గణేష్ ఉత్సవాలు మిన్నంటాయి. ఈ పండగ మెగా ఫ్యామిలీకి మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే మెగా వారసురాలు ‘క్లీన్ కార’ పుట్టిన తర్వాత వచ్చిన తొలి వినాయక చవితి ఇది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్థిస్తున్నానంటూ’ ఇంట్లో జరుపుకున్న గణేష్ పండగ సెలబ్రేషన్స్ ఫోటోలను పంచుకున్నాడు.
అంతేకాకుండా ‘ఈ పండగ తమకు చాలా ప్రత్యేకమైనదని, చిన్ని ‘క్లీన్ కారా’తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం ఆనందంగా ఉందంటూ’ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. కాగా పెళ్లైన పదకొండేళ్ల తర్వాత రామ్చరణ్-ఉపాసనలు తల్లిదండ్రులయ్యారు. కాగా ఈ ఏడాది జూన్లో మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టింది.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !
ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏ఈ సారి ప్రత్యేకత … చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం 😍😊
Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the… pic.twitter.com/FeaFOtDdhd
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 18, 2023