Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నటించనున్న రెండు కొత్త సినిమాల ప్రకటనలు ఇటివలే వచ్చాయి. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రెండు నిర్మాణ సంస్థలు సినిమాల్ని అధికారికంగా ప్రకటించాయి. ఒకటి చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల (Susmitha konidela) సంస్థ గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ చిత్రం కాగా, మరొకటి యు.వి.క్రియేషన్స్ (UV Creations) సంస్థ నిర్మిస్తున్న చిత్రం. సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం మెగా 156 . యూవీ క్రియేషన్స్ లో వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం మెగా 157.
అయితే ఇప్పుడు సుస్మిత నిర్మించే చిత్రం మెగా 156 పై ఓ రూమర్ బయటికొచ్చింది. ఈ చిత్రం క్యాన్సిల్ అయ్యిందని, స్క్రిప్ట్ సరిగ్గా కుదరని కారణంగా సినిమా ప్రీప్రొడక్షన్ స్టేజ్ లోనే ఆపేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణని మొదట దర్శకుడిగా అనుకున్నారు. అయితే అనౌన్స్ మెంట్ లో దర్శకుడిగా ఆయన పేరు ఇవ్వలేదు. మంచి రోజు చూసుకొని ఈ చిత్రానికి సంబధించిన పూర్తి వివరాలు ఇస్తారనని ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పడు ఇలాంటి రూమర్ బయటికొచ్చింది. మరి ఈ రూమర్ లో వాస్తవం ఏమిటో తెలియంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి క్లారిటీ రావాల్సిందే.
ఇక వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ కథతో రూపొందనుంది. పంచభూతాల్ని ప్రతిబింబించే ఓ పోస్టర్ ఇప్పటికే ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె నాయుడు పని చేయనున్నారు. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.