Megastar Chiranjeevi | టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతికి గాయం అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి మృతిచెందింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించడంతో పాటు రాజేంద్రప్రసాద్‌ను కలిసి ధైర్యం చెబుతున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన కుటుంబంతో రాజేంద్రప్రసాద్‌ను పరమర్శించడానికి వచ్చాడు. అయితే చిరు కారులో నుంచి దిగుతుండగా.. అతడి ఎడమ చేతికి గాయం అయినట్లు తెలుస్తుంది. ఎడమ చేయికి ఫ్యాక్చర్ అవ్వడంతో చిరు బ్యాండేజ్‌తో వాడుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలతో పాటు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే చిరు నటిస్తున్న విశ్వంభర షూటింగ్‌లోనే ఈ గాయం అయినట్లు తెలుస్తుంది. గాయం పెద్దగా అవ్వకపోవడంతో బ్యాండేజ్‌తో చిరు మ్యానేజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
Hand Jagratha Annayya @KChiruTweets #Chiranjeevi#MegastarChiranjeevi pic.twitter.com/eZLEkiPqUl
— Chiru Tridev (@tridev16) October 5, 2024